మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం (సివిల్ టైట్స్ డే) మానవ హక్కుల దినోత్సవం నిర్వహించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా అంటరాని తనాన్ని రూపుమాపడమే ద్యేయంగా ప్రజలందరూ ముందుకెళ్లాలని అధికారులు పిలుపునిచ్చారు.కుల,మత,వర్గ భేదం లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్యాం సుందర్, ఏఎస్ఐ,ఆర్ఐ,ప్రజలు పాల్గొన్నారు.