– పశుసంవర్దకశాఖ ఏడీఏ ప్రదీప్‌కుమార్
నవతెలంగాణ-సత్తుపల్లి
పశు సంరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని సత్తుపల్లి పశు సంవర్దకశాఖ ఏడీ డాక్టర్ కె ప్రదీప్‌కుమార్ అన్నారు. స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డైరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం వెటర్నరీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పశువుల మనుగడ-పర్యావరణం-జీవ వైవిద్యం అంశాలపై మాట్లాడుతూ ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని విరించారు. పశు సంపదను సంరక్షించడమే గాక వాటికి వచ్చే వ్యాధులకు చికిత్స అందిస్తూ ఆ వ్యాధులు మనుషులకు సంక్రమించకుండా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశువులకు మనకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ మనకి అవసరమైన సహజ సిద్ధమైన పౌష్టికాహారం పశువుల ద్వారా ఏఏ పద్ధతుల్లో లభిస్తుందో తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయకుమార్ మాట్లాడుతూ 2021 నుంచి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డైరీ సైన్స్ కోర్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ పానెం రామచంద్రరావు, వైస్ ప్రిన్సిపాల్ జి వీరన్న, అధ్యాపకులు రాంబాబు, బంగారి, పీర్ సాహెబ్, డాక్టర్ శ్రీధర్, మధు, శ్రీనివాస్, డాక్టర్ ఎం మాధవి, రవికుమార్, డాక్టర్ విజయలక్ష్మి, శ్రీకాంత్‌పాల్గొన్నారు.