నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
లారీలో ప్రయాణం చేస్తూ గుండె నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ పోలీస్ సిబ్బంది సకాలంలో వైద్య సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్న సంఘటన గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కొవ్వూరు కు చెందిన అర్జున్ కుమార్ అతని తండ్రి చెల్లి వెంకటరమణ గురువారం చౌటుప్పల్ టౌన్ తంగడపల్లి ఎక్స్ రోడ్ లో సుమారుగా ఉదయం 2:30 గంటల ప్రాంతంలో ఆంధ్ర నుండి లారీ నెంబర్ AP39T5468 లో వస్తున్న అర్జున్ కుమార్ అనే వ్యక్తి అటుగా పెట్రోలింగ్ చేస్తున్న చౌటుప్పల్ పిఎస్ బ్లూ కోర్టు సిబ్బంది పి నాగరాజు పీసీ 1062, హెచ్ 586 వెంకటేష్ లను చూసి లారీ ఆపి వారిని కలిసి ఇక్కడ ఏమైనా ఆసుపత్రి ఉందా అని అడుగగా బ్లూకోర్టు పోలీసు వారు ఏం జరిగిందనే విషయం తెలుసుకోగా వాళ్ళ నాన్నగారైన చెల్లి వెంకటరమణ(55)కు ఛాతిలో బాగా నొప్పి వచ్చి చిట్యాల నుండి బాగా ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని తెలియజేసినాడు.వెంటనే బ్లూ కోర్టు సిబ్బంది అప్రమత్తమై వాళ్ల తండ్రి అయినా చెల్లి వెంకటరమణను వారి యొక్క వాహనంపై చౌటుప్పల్ అర్బన్ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు.అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిశీలించి అతనికి హార్ట్ ఎటాక్ అని లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనీ ప్రాథమిక చికిత్స చేసి ఇంకా మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించారు.వెంటనే పోలీస్ సిబ్బంది, హాస్పిటల్స్ సిబ్బంది సహకారంతో అంబులెన్స్ని పిలిపించుకొని చెల్లి వెంకటరమణను హైదరాబాద్ కు మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడమైనది. ఈ విషయంలో సహాయ సహకారాలు అందించిన పోలీసువారికి వెంకటరమణ కుమారుడైన అర్జున్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేసి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ చాలా చక్కగా అమలవుతుందని తెలిపినాడు. ఈ సందర్భంగా సహాయం అందించిన పోలీసు సిబ్బంది మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ గురించి తమ సీఐ అశోక్ రెడ్డి ప్రతిరోజు తమకు రోల్ కాల్ లో చెప్తారని తెలియజేసినారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ వేల్మా అశోక్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించారు.