– స్నేహితుని కూతురు వివాహానికి ఆర్ధిక సహాయం అందుచేత
నవతెలంగాణ – తుర్కపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవతగతి వరకు చదువుకున్న,1999-2000 బ్యాచ్ ఎస్ఎస్ సి స్టూడెంట్స్ తన స్నేహితుని కూతురు వివాహానికి ఆర్థిక సహాయం అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామమానికి చెందిన కోట సురేష్(సూరి)తమతో కలిసి పదవతగతి వరకు చదువుకున్నాడని,గత 15 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో మరణించడం జరిగిందని,ఆ తరువాత అతని భార్య కూడా చనిపోయిందని మృతుని స్నేహితులు తెలిపారు.కాగా నేడు వివాహం జరుపుకున్న తన స్నేహితుని కూతురు కోట శ్రావణి వివాహానికి తమ వంతు సహాయంగా పూర్వ స్నేహితులు రూ.40 వేల రూపాయల విలువగల బంగారాన్ని అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ.స్నేహితుని జ్ఞాపకార్థం చిన్న సహాయం చేయడం తమకు సంతోషమని అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ స్నేహితులు షేక్ బూరాన్,ఏ అంజనేయులు, గోనె మధు,కే ఉపేంద్ర చారి,ఎస్ రఘు, కె లక్ష్మీనారాయణ, జె శ్రీను,ఎ బాలరాజు,ఎ శ్రీనివాస్,బి రవి, ఎండిఅష్పక్,పి జహంగీర్,ఏ సైదులు, బి రవీందర్, డి శ్రీనివాస్,ఏ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.