
నవతెలంగాణ – కొనరావుపేట
కొనరావుపేట మండలం మర్తన్నపేట నాగారం గ్రామం మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి మార్పాకకు చెందిన ముడుక రవి అనే వ్యక్తి కింద పడిపోయాడు. అటుగా వెళుతున్న సర్పంచ్ వంశీ కృష్ణారావు వెంటనే 108 సర్వీస్కు ఫోన్ చేసి ఆయనను సిరిసిల్ల ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణాపాయం లేదు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు లింగాల సత్తయ్య ఉన్నారు.