మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ 

Humane traffic head constable– బాధితురాలికి హ్యాండ్ బాగ్ అప్పగింత
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకుంది. పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ రైల్వే స్టేషన్ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ చందులాల్ కు దొరికింది. డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) హ్యాండ్ బ్యాగ్ లో వెతకాగా ఫోన్ నెంబర్ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా బ్యాగ్ పోగొట్టుకున్న వారికి ఫోన్ చేసి తెలిపారు. బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, రూ.1200/-  బాధితురాలికి అప్పగించారు. బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది.