జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మానవహారం ..

On the occasion of National Voter's Day, the massacre.నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించి మానవారమే ఏర్పాటు చేసి ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ రామేశ్వరరావు మాట్లాడుతూ..కచ్చితంగా 18 సంవత్సరాల నిండిన యువతి యువకులందరూ ఓటు వేయాలని ఓటు అనే ఆయుధంతోనే ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గేమ్ సింగ్, డిప్యూటీ తాసిల్దార్ సరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.