గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. దసరా కానుకగా నేడు (శుక్రవారం) గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినియా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచాయి. మేకర్స్ గురువారం ‘గుంగురు గుంగురు..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్‌తో పెర్ఫెక్ట్ ఫెస్టివల్ నెంబర్‌గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ అదిరిపోయింది. సురేష్ గంగుల రాసిన మ్యాసీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో అదరగొట్టారు. ఈ సాంగ్‌లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. వైబ్రెంట్ సెట్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లోని విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. థియేటర్స్‌లో ఈ సాంగ్ పండగలా ఉండబోతోంది అని చిత్ర బృందం తెలిపింది. శ్రీనువైట్ల సినిమా అంటే ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సినిమా కూడా ఆయన మార్క్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గోపీచంద్ విశ్వంగా భిన్న క్యారెక్టర్ చేశారు. గతంలో ఆయన ఇలాంటి పాత్రను చేయలేదు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ పాయింట్ అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇందులో ఫాదర్, డాటర్ ఎమోషన్ కూడా అందరిని భావోద్వేగానికి గురి చేస్తుంది. దసరా పండగ నేపథ్యంలో వస్తున్న మా సినిమా కచ్చితంగా బిగ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం అని మేకర్స్ తెలిపారు. ఈచిత్రానికి దర్శకత్వం: శ్రీను వైట్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, డీవోపీ: గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు.