18న ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

నవతెలంగాణ- మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దు లో గల ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రమైన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 18న అనగా  బుధవారం నాడు ఉదయం 11 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ ఆలయ గుమస్తా వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులు, పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆలయ అధికారులు కోరారు.