తెలంగాణలో వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం

– టీడీ జనార్ధన్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వందల అడుగుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్‌, మీడియా ఇన్‌చార్జి టీడీపీ ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని తనను కలిసిన విలేకర్లతో వారు మాట్లాడారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి హైదరాబాద్‌లో స్థలాన్ని ఇంకా గుర్తించలేదనీ, గుర్తించిన తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేయాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వారు చెప్పారు.