విజ్ఞానభారతి విద్యార్థుల వంద శాతం ఉత్త్తీర్ణత

నవతెలంగాణ-నాచారం
పది ఫలితాల్లో వెంకట రమణ కాలనీ, మల్లాపూర్‌ కు చెందిన విజ్ఞానభారతి హై స్కూల్‌ విద్యార్థులు 100 శాతం ఉత్త్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్‌ పి. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన 113 మంది పరీక్షలు రాయగా 100 శాతం ఉత్తిర్ణత సాధించారని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన ఆర్‌. వర్షిత10/10 జీపీఏ సాధించగా ఎన్‌.హర్షిత , ఎం.భవ్యశ్రీ, ఎన్‌.మదుల 9.7, కే. శ్రీవిజ్ఞ, వీ.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి 9.5 సాధించారన్నారు. విద్యార్థులకు చక్కగా బోధించి మంచి ఫలితాలు సాధించేందుకు కషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులు ఆర్‌వీ. ప్రసాద్‌, పుష్పలత, రాధ, సంధ్య,మానస, గునలక్ష్మి, సాజిత బేగంలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.