వందల యేండ్ల దురాచారాన్ని ధిక్కరించారు..

వందల యేండ్ల దురాచారాన్ని ధిక్కరించారు..– చెప్పులు ధరించి వీధిలో నడిచారు!
తిరుప్పూర్‌ : స్వాతంత్య్రానికి పూర్వం నుండీ ఉన్న ఆచారానికి ముగింపు పలుకుతూ, తమిళనాడులోని దళితులు అగ్రవర్ణాల వారిపై విధించిన అలిఖిత నిషేధాన్ని ధిక్కరించారు. తమిళనాడు తిరుప్పూర్‌ జిల్లాలోని మడతుకులం తాలూకాలోని రాజవూర్‌ గ్రామంలో కంబళ నైకెన్‌ వీధిలో మొదటిసారిగా 60 మంది దళితులు పాదరక్షలు ధరించి నడిచారు. అలా చేయడం ద్వారా దళితులు చెప్పులతో వీధిలో నడవకూడదన్న అగ్రవర్ణాల వారు విధించిన నిబంధనను ఉల్లంఘించారు. షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) సభ్యులకు వీధిలో సైకిల్‌ తొక్కడానికి కూడా అనుమతి లేదని ఆ ఊరి వాళ్లు పేర్కొన్నారు.
300 మీటర్ల పొడవైన వీధిలో 60 మంది నివాసితులు వెనుకబడిన కులాల వర్గానికి చెందిన నాయకర్లు. గ్రామంలోని దాదాపు 900 కుటుంబాలలో 800 మంది గౌండర్లు, నాయకర్లు వంటి ఆధిపత్య కులాలకు చెందినవారు.
ఆ వీధిలో నివాసముండే మురుగానందం (51) విలేకరులతో మాట్లాడుతూ, ”అరుంధతియార్‌ కుల సభ్యులు వీధిలో చెప్పులతో నడవకుండా నిరోధించబడ్డారు. ఎస్సీ సభ్యులను చంపేస్తామని బెదిరింపులు మరియు దాడులు కూడా చేశారు. అగ్రవర్ణాల మహిళలు కూడా ఎస్సీ సభ్యులకు చెప్పులు తొడుక్కొని వీధిలో నడిస్తే స్థానిక దేవత మరణిస్తాడని బెదిరింపులకు దిగారు. మేం వీధికి దూరంగా ఉన్నాం. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నాం. కొన్ని వారాల క్రితం, మేము సమస్యను దళిత సంఘాల దష్టికి తీసుకెళ్లాం అని తెలిపాడు.
మరొక దళితుడు మాట్లాడుతూ.. ”స్వాతంత్య్రం తర్వాత అంటరానితనాన్ని నిషేధించినప్పుడు, ఆధిపత్య కులానికి చెందిన సభ్యులు ఆ ఆచారాన్ని కొనసాగించడానికి ఒక కథను అల్లారు. వీధిలో దిష్టి బొమ్మను పాతిపెట్టారు దళిత వర్గపు ప్రజలు చెప్పులతో నడిచినట్లయితే.. వారు మూడు నెలల్లో చనిపోతారంటూ కథలల్లారు. ఆ కథలను నమ్మిన అమాయకులు చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించారు, ఆ పద్ధతి ఈనాటికీ కొనసాగింది.
తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్‌ (తిరుప్పూర్‌) కార్యదర్శి కనగరాజ్‌ గత వారం గ్రామాన్ని సందర్శించి ఆ దురాచారం గురించి తెలుసుకున్నారు. దళిత మహిళలకు ఆ వీధిలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి లేదని కనుగొన్నారు.
ఆ సంస్థ వారు నిరసనను ప్రారంభించాలని ప్రయత్నిస్తే.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌), విడుతలై చిరుతైగల్‌ కచ్చి మరియు దళిత హక్కుల సంస్థ ఆతి తమిజర్‌ పేరవై వంటి రాజకీయ పార్టీల కార్యకర్తలతో పాటు ఫ్రంట్‌ సభ్యులు వీధిలో నడవాలని నిర్ణయించుకున్నారు. పెరియార్‌ వర్ధంతి రోజున (డిసెంబర్‌ 24) చెప్పులు వేసుకుని ఆ బీచ్‌లో నడిచే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
అక్కడితో ఆగకుండా ఆ 60 మంది సభ్యుల బందం ఆ గ్రామంలోని రాజకాళిఅమ్మన్‌ దేవాలయంలోకి సైతం ప్రవేశించి.. వందలయేళ్ల మనుధర్మం ఇక చెల్లుబాటు కాదు అని తేల్చేసారు.