చేపల కోసం వేట

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Adilabadనవతెలంగాణ-మంచిర్యాల
జిల్లాలో గత మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు నిండి పోయాయి. మంచిర్యాల పట్టణంలోని రాళ్ళ వాగులో భారీగా నీరు చేరడంతో పట్టణానికి చెందిన పలువురు చేపల కోసం వేట మొదలు పెట్టారు. బొక్కల గుట్ట నుండి మంచిర్యాల మీదుగా ప్రవహించే ఈ రాళ్ళ వాగు మంచిర్యాల పట్టణంలో గల బైపాస్‌ రోడ్‌, రాళ్ళపేట మధ్య నుంచి ప్రవహిస్తుంది. చెరువులో వరద నీరు బాగా చేరడంతో వలలు, గ్యాలలతో చేపలు పట్టడం మొదలెట్టారు. పట్టణ యువకులు దొరికిన చేపలను కొందరు ఇంటికి తీసుకెళ్లగా మరి కొందరు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.