భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్..

Husband arrested for killing wifeనవతెలంగాణ – బాల్కొండ 
భార్యను అతి కిరాతకంగా నరికి హత్య చేసిన ఆమె భర్తను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్  బి గ్రామంలో ఆదివారం జరిగిన మహిళా దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మండల కేంద్రంలోని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ కే శ్రీధర్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ బి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా బెల్కొని గ్రామం నుంచి జంగ శివకల తన భర్త రాజుగంగారంతో కలిసి వన్నెల్ బి గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. భర్త రాజుగంగారం తాగుడుకు బానిసై గత ఆరు నెలలుగా భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని, ఈ క్రమములో ఆదివారం రాత్రి భార్య శివకల నిద్రిస్తున్న సమయంలో భర్త గొడ్డలితో విచక్షణా రహితంగా తలపైన నరకడంతో అక్కడికక్కడే భార్య శివకల మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త రాజుగంగారం పరారయ్యాడు. సోమవారం నమ్మదగిన సమాచారం మేరకు రాజు గంగారంను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలింమని సీఐ తెలిపారు.