
హుస్నాబాద్ సీఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాస్ బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ సిఐ శ్రీనివాసు ను అభినందించారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.