పొన్నం ప్రభాకర్‌కి హుస్నాబాద్‌ టికేట్‌ కేటాయించాలి

– నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ పరశురామ్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ బీసీ బిడ్డ కరీంనగర్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌కు కేటాయించాలని హుస్నాబాద్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మంద పరశురామ్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు పొన్న ప్రభాకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అహర్నిశలు కషి చేశా డన్నారు. పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే దాడిని సైతం తట్టుకొని స్వరా ష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు, కార్యక ర్తలకు అన్నా అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూన్నారని తెలిపారు. టీపీసీసీి దీనిపై దష్టి ఉంచుకొని బీసీ బిడ్డ అయిన పొన్నంప్రభాకర్‌కి టికెట్‌ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.