– పేదవాడిని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకలు
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కే వెంకటాపూర్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన తులసమ్మ గోపరి నరసింహులు దుర్గమ్మల గుడిసె కరెంటు సర్క్యూట్‌తో దగ్దమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె పూర్తిగా దగ్దమైనట్లు తెలిపారు. గుడిసెలోని బట్టలు, బియ్యర, నిత్యావసర సరుకులు కలిపి దాదాపు రూ.50 వేల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. రాత్రిపూట అయితే ప్రాణ నష్టం జరిగేదని ఉదయం పూట అయినందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దయాకర్ తెలిపారు. ఈ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలని, బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని , వారికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బాధితుల కుటుంబాన్ని ఎవరైనా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీటీసీ భాగ్య లక్ష్మి సిద్ధ రాములు, ఉప సర్పంచ్ శేఖర్ మహిపాల్, గోపరి స్వామి, వెంకట్, నర్సింలు, తదితరులు కోరారు.