నవతెలంగాణ-ఇల్లంతకుంట : హుజూరాబాద్ బాద్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం జాతర ఉత్సవాల గురించి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర దేవస్థానాన్ని సందర్శించారు. గుడి ఈఓతో చర్చించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీతో పాటు జమ్మికుంట రూరల్ సీఐ కె. కిషోర్, ఇల్లంతకుంట ఎస్ఐ ఎన్ రాజ కుమార్ పాల్గొన్నారు.