హుజురాబాద్ తాలుకాను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి

– జిల్లా సాధన సమితి డిమాండ్
నవతెలంగాణ-వీణవంక :
హుజురాబాద్ తాలుకా ప్రాంతాన్ని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని పీవీ జిల్లా సాధన సమితి (జేఏసీ) కన్వీనర్  బీమోజు సదానందం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో గత పాలకులు ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల్సింది పోయి పక్క జిల్లాల ఏర్పాటుకు సాయం చేశారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందని, ఈ ప్రాంతంలో విద్యా, వైద్యం, రవాణాకు అవకాశం ఉందని చెప్పారు. కావున ఈ ప్రాంతంలో మరిన్ని మండలాలను ఏర్పాటు చేసి 13 మండలాలతో కూడిన పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో జిల్లా కోసం ఈ ప్రాంతం అంతా తిరిగి జిల్లా ఆవశ్యకతను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని, అలాగే ఉద్యమ కార్యచరణ ప్రకటించి ఉద్యమిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పీవీ జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ మెంబర్లు, జెఎసి నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, పొడిసెట్టి వెంకట్రాజం, మోరె సతీష్, రుద్రారపు రవితేజ, మహ్మద్ రఫీ, పరకాల రమేష్, ఈదులకంటి రవీందర్ రెడ్డి, గెల్లు మల్లయ్య యాదవ్, మర్రి స్వామి యాదవ్, పులి ప్రకాష్, దాసారపు శ్యామ్, గాజుల సమ్మయ్య, ఒడ్డెపల్లి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.