– ఉప్పల్‌లో నేటి నుంచి రంజీ పోరు
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజీ ట్రోఫీలో తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్ర నేడు ముఖాముఖి పోరుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో ఓ విజయం సాధించగా, ఆంధ్ర ఖాతాలో ఒక్క విజయం కూడా లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభానికి ముందు జరుగుతున్న ఆఖరు రంజీ పోరు కావటంతో ఇరు జట్లు సైతం విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. తన్మరు అగర్వాల్, రాహుల్ సింగ్, హిమతేజ, రాహుల్ రాడేశ్‌లు హైదరాబాద్‌కు కీలకం కానున్నారు. ఆంధ్ర తరఫున షేక్ రషీద్, హనుమ విహారి, రికీ భురు, శ్రీకర్ భరత్ కీలక ఆటగాళ్లు. నేడు ఉదయం 9.30 నుంచి హైదరాబాద్, ఆంధ్ర రంజీ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఆరంభం కానుంది.