– ఈవెంట్ ఇండిస్టీ అభివద్ధికి భవిష్యత్తు
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌ను మీటింగ్స్, ఇన్‌సెంటీవ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జీబిషన్స్(ఎంఐసీఈ) టూరిజం కాపిటల్‌గా అభివద్ధి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా ఎగుమతుల కేంద్రంగా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈవెంట్ ఇండిస్టీ అభివద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్‌సిటీలోని హైటెక్స్‌లో జులై 24,25 తేదీల్లో ‘సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ నిర్వాహణపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. నిర్వాహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివద్ధితోపాటు హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నదని అన్నారు. మైస్ టూరిజంలో హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈవెంట్ ఇండిస్టీ అభివద్ధికి పర్యాటకశాఖ తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరాంబాబు, కనీషా సబనాన్ తదితరులు పాల్గొన్నారు.