– హిమాచల్‌పై ఇన్నింగ్స్ 43 పరుగులతో గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజీ ట్రోఫీ గ్రూప్-బిలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. స్పిన్నర్ అనికెత్ రెడ్డి (5/72, 4/46) తొమ్మిది వికెట్ల మాయజాలంతో హిమాచల్ ప్రదేశ్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు కుప్పకూలిన హిమాచల్ ప్రదేశ్.. ఫాలోఆన్‌లో 247 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్ తనరు త్యాగరాజన్ (6/118)తో రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శనతో మ్యాజిక్ చేశాడు. 45.4 ఓవర్లలో 247 పరుగులే చేసిన హిమాచల్ ప్రదేశ్ టీ విరామానికి ముందే చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 565 పరుగులు చేసింది. రంజీ లీగ్ దశ ఆఖరు మ్యాచ్‌లో ఈ నెల 30 నుంచి విదర్భతో హైదరాబాద్ తలపడనుంది.