హైదరాబాద్‌ ముందంజ!

Hyderabad is ahead!– విదర్భ తొలి ఇన్నింగ్స్‌ 190/10
నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ గ్రూప్‌-బి చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. బౌలర్లు సమిష్టిగా రాణిచటంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలింది. అనికెత్‌ రెడ్డి (3/54), రక్షణ్‌ రెడ్డి (3/29) మూడేసి వికెట్లు పడగొట్టగా.. సివి మిలింద్‌ (2/46) రాణించాడు. మహ్మద్‌ సిరాజ్‌ (1/47), తనరు త్యాగరాజన్‌ (1/3) చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ 6/80తో స్వల్ప స్కోరుకే ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. లోయర్‌ ఆర్డర్‌లో హర్ష్‌ దూబె (65, 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీతో విదర్భను ఆదుకున్నాడు. 55.5 ఓవర్లలోనే విదర్భ కథ ముగిసింది.