హైదరాబాద్‌ కిరాక్‌ షో

 Hyderabad Kirak Show– ప్రొ పంజా లీగ్‌ సీజన్‌ 1
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌)లో కిరాక్‌ హైదరాబాద్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో కోచి కెడి’ఎస్‌పై కిరాక్‌ హైదరాబాద్‌ 18-10తో ఘన విజయం సాధించింది. ప్రొ పంజా లీగ్‌ తొలి సీజన్‌లో కిరాక్‌ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. తొలుత అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో కిరాక్‌ హైదరాబాద్‌ స్వీప్‌ చేసింది. 3-0తో ఆధిక్యం దక్కించుకుంది. షాహిల్‌ హుస్సేన్‌, మధుర కెఎన్‌, రాహుల్‌ మహర్‌లు 1-0తో విజయాలు సాధించారు. ఇక మెయిన్‌ కార్డ్‌లో స్టీవ్‌ థామస్‌ 10-0తో గెలుపొంది హైదరాబాద్‌కు 13-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్‌లో అహ్మద్‌ ఫైజల్‌ అలీ 0-10తో నిరాశపరిచాడు. చివరి మ్యాచ్‌లో నవీన్‌ అదరగొట్టాడు. 5-0తో కిరాక్‌ హైదరాబాద్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. నేడు జరిగే మరో మ్యాచ్‌లో ముంబయి మజిల్‌తో కిరాక్‌ హైదరాబాద్‌ పోటీపడనుంది. కోచి కెడి’ఎస్‌పై ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆర్మ్‌ రెజ్లర్లను కిరాక్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీ యజమాని నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు.