– రామ్‌రెడ్డి, ఈశ్వర్‌సాయిలకు సింగిల్స్ టైటిల్స్
హైదరాబాద్ : మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన 20వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. దేశవ్యాప్తంగా 220 మంది క్రీడాకారులు పోటీపడిన ఈ టోర్నీలో విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమతి అందజేశారు. మెన్స్ 30 ప్లస్ సింగిల్స్ ఫైనల్లో విజరు ఆనంద్‌పై ఈశ్వర్ సాయి విజేతగా నిలువగా.. డబుల్స్‌లో మంజునాథ ప్రసాద్, సురేశ్ రెడ్డిలపై ఈశ్వర్ సాయి, విశాఖ్ లు 10-9, 7-1తో పైచేయి సాధించి టైటిల్ సాధించారు. 40 ప్లస్ సింగిల్స్‌లో జి రాజ 10-0తో మురళీధర్‌పై గెలుపొందగా… డబుల్స్ విభాగంలో జి రాజ, లగ్గాని శ్రీనివాస్ జోడీ 10-8తో రామచంద్ర కిరణ్, అశ్విన్ కుమార్‌లపై విజయం సాధించారు. 50 ప్లస్ సింగిల్స్‌లో సాంబ శివా రెడ్డిపై 10-8తో శ్రీధర్ గెలుపొందగా.. డబుల్స్‌లో నంద్యాల నరసింహారెడ్డి రన్నరప్‌గా నిలిచింది. కుమారస్వామి, వెంకటేశ్వర్లు 10-8తో నరసింహారెడ్డి,దమ్రెలపై గెలుపొందారు. 60 ప్లస్ సింగిల్స్‌లో ప్రియదర్శిని రామ్‌రెడ్డి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో రమేశ్‌పై అలవోక విజయం సాధించాడు. డబుల్స్‌లో పాల్ మనోహర్, రమేశ్‌లు శ్రీనివాస్, ఆనందస్వరూప్‌లపై 10-5తో పైచేయి సాధించారు. 70 ప్లస్ సింగిల్స్‌లో వెంకట సన్యాసి రాజు 10-2తో సాయిరామ్ బాబుపై గెలుపొందగా.. డబుల్స్‌లో కల్నల్ అంకయ్య, గజపతి నాయుడు జోడీ 10-3తో రవి కుమార్, కష్ణమోహన్‌లపై గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్‌ఓటీఏ) అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, క్యాప్‌స్టోన్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ కొడాలి శ్రీకాంత్‌లు సింగిల్స్, డబుల్స్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.