హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటి సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు

– పాల్గొననున్న చంద్రబాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆ క్యాంపస్‌లో బుధవారం నిర్వహిస్తున్న ఇంట్రాక్షన్‌ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ట్రిపుల్‌ ఐటీ ఆవిర్భావం, ఐటీ సెక్టార్‌ గ్రోత్‌ తదితర అంశాలపై విద్యార్థులతో బాబు చర్చిస్తారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సిల్వర్‌ జూబిలీ ఉత్సవాల్లో భాగంగా కొద్ది రోజులుగా పలు ఈవెంట్లు నిర్వహిస్తున్న యాజమాన్యం, అందులో భాగంగానే విద్యార్థులతో ముఖాముఖి, చర్చా కార్యక్రమానికి అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో (1998) హైదరాబాద్‌ఐఐఐటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.