నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి మంగళవారం, డివైడర్లను తొలగించాలని డిమాండ్ తో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే పై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేయడంతో గ్రామంలోకి ఆర్టీసీ బస్సులు రావడంలేదని, తద్వారా గ్రామం నుండి మరో ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.