హైదరాబాద్‌ పరాజయం

హైదరాబాద్‌ పరాజయం– సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ
రాజ్‌కోట్‌ : దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీలో హైదరాబాద్‌ మరో ఉత్కంఠ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 197 పరుగుల ఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 189 పరుగులే చేసింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (9) నిరాశపరిచాడు. రోహిత్‌ రాయుడు (56), మికిల్‌ జైస్వాల్‌ (39), సివి మిలింద్‌ (55) మెరవటంతో హైదరాబాద్‌ ఆఖరు వరకు పోటీలో నిలిచింది. 7 పరుగుల తేడాతో పంజాబ్‌ మెరుపు విజయం సాధించింది. అన్మోల్‌ప్రీత్‌ (60), నేహల్‌ వదేరా (31), రమణ్‌దీప్‌ (39 నాటౌట్‌) రాణించటంతో పంజాబ్‌ తొలుత 196/6 పరుగులు చేసింది.