హైదరాబాద్‌ పరాజయం

Hyderabad's defeat– 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర గెలుపు
అహ్మదాబాద్‌ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు మరో ఓటమి తప్పలేదు. గ్రూప్‌-సిలో సౌరాష్ట్రతో మ్యాచ్‌లో హైదరాబాద్‌ పరాజయం పాలైంది. 245 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర మరో 43 బంతులు ఉండగానే ఛేదించింది. హర్వీక్‌ దేశారు (125, 129 బంతుల్లో 19 ఫోర్లు), జై గోహిల్‌ (60, 68 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 42.5 ఓవర్లలోనే సౌరాష్ట్ర లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (57), అరవెల్లి అవనీశ్‌ (52) రాణించటంతో 50 ఓవర్లలో 244/8 పరుగులు చేసింది.