జైపూర్ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో విదర్భపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (102, 98 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో మెరువగా.. ఓపెనర్లు ధ్రువ్ (83, 99 బంతుల్లో 7 ఫోర్లు), అతర్వ (44) రాణించారు. ఛేదనలో తన్మరు అగర్వాల్ (77 నాటౌట్, 77 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రాహుల్ సింగ్ (62 నాటౌట్, 80 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అరథసెంచరీలతో రాణించగా 29 ఓవర్లలో హైదరాబాద్ 159/1 పరుగులు చేసింది. ఈ సమయంలో వెలుతురు లేమి, స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల సమస్యతో మ్యాచ్ గంటన్నరకు పైగా నిలిచిపోయింది. దీంతో ఫలితాన్ని వినోద్ జైదేవ్ (విజెడి) పద్దతిలో తేల్చారు. హైదరాబాద్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-బి టాపర్ విదర్భకు ఇదే తొలి ఓటమి.