
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వ, చెరువు శిఖిం, నాలాలు, ఎఫ్టీఎల్ భూములను అక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తున్న హైడ్రా తరహా అథారిటీని మండలంలో అమలు చేయాలని ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.విధుల్లో కమిషనర్ ఏవీ రంగనాథ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను తిరిగి అప్పగిస్తున్నందుకు బాలనర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.మండలంలోని ప్రభుత్వ భూములు అక్రమణకు గురయ్యాయని అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి విచారణ జరిపి ప్రభుత్వ భూములను స్వాదీనం చేసుకోవాలని దీటీ బాలనర్స్ కోరారు.