హ్యుందారు కార్లు ప్రియం

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందారు మోటార్‌ ఇండియా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఫారెక్స్‌ కరెన్సీలో మార్పుల నేపథ్యంలో 2024 జనవరి 1తేది నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని పేర్కొంది. అయితే ఎంత మొత్తంలో పెంచేది ఆ సంస్థ వెల్లడించలేదు.