
హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా కొత్త క్రెటా కారు ని విడుదల చేసింది. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారులో గల ప్రకాష్ హ్యుందాయ్ షోరూం నందు ఎండీ నల్ల దినేష్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ బి ఐ మేనేజర్స్ హర్ష (మెయిన్ బ్రాంచ్ ),మరియి సాయి ( ఆర్ ఆర్ నగర్ ) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 హ్యుందాయ్ క్రెటా కారును విడుదల చేసారు. ఎండీ మాట్లాడుతూ ఎందరో కస్టమర్ల మన్ననలు పొందిన క్రెటా కారును సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీని పొందుపరుస్తూ కస్టమర్ల అభిరుచులకు తగట్టు గా ఈ నూతన క్రెటా కారు ని తీసుకరావటం ఆనందం గా ఉంది అని తెలియజేశారు. ఈ డైనమిక్ SUV క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు మరియు హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 ADAS వంటి ఫీచర్లను కలిగి ఉన్న ‘సెన్సుయస్ స్పోర్టినెస్’ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉందన్నారు. ఇది కొత్త 1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో సహా శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ల ఎంపికను ధర రూ 10.99-19.99 లక్షలు ( ఎక్సషోరూమ్) అందిస్తుంది.భారతదేశంలో హ్యుందాయ్ యొక్క SUV లైనప్‌కు కొత్త శకం ప్రారంభమైంది. కొత్త CRETA తో మీ డ్రైవ్‌లో విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండిఅని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో షోరూం మేనేజర్ బొజేందర్, సర్వీస్ మేనేజర్ సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.