నేను కూడా యూత్ కాంగ్రెస్ నుండి మంత్రి స్థాయికి వచ్చా..

– కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు పెద్దపీట వేస్తుంది 

– మంత్రిని సన్మానించిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నేను కూడా యూత్ కాంగ్రెస్ నుండి మంత్రి స్థాయికి వచ్చానని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బృందావన్ గార్డెన్ లో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కవడానికి వస్తుండగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులంతా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నేను కూడా యూత్ కాంగ్రెస్ నుండి మంత్రి స్థాయికి వచ్చానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, అరుణ్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.