– ఎవరిపై దాడి చేయలేదు..
– మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి సంతోష్ రెడ్డి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
గత 30 ఏళ్ళుగా నా భూమి లో నేను ఆరుతడి,ఇతర పంటలు పండిచుకుంటు నున్నని ఇతరుల భూమిని కబ్జా చేసుకుని దానిలో చేసేది ఏమీ లేదని,నేను ఎవ్వరి భూమి కాబ్జా కాని, దాడి కాని చేయలేదని, కావాలని కొందరు గిట్టని వారు తనపై లేనిపోని అర్పణాలు చేస్తున్నారని రాజకీయ కక్షతోనే నిందారోపణాలు చేస్తున్నారని, నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి పనులకు వెనుక ఉండి చేయిస్తున్నారని మాజీ ఎంపీటీసీ చిన్నారెడ్డి సంతోష్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు.మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇందల్ వాయి మండలం లోని గౌరరం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగపుర్ వద్ద 180 సర్వే నెంబర్ లో 630 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 300 ఎకరాలు ఫారెస్ట్కు సంబంధించినది ఉండగా మిగతా 330 ఎకరాలు అసైన్మెంట్ భూమి కలిగి ఉందన్నారు.నాకు 1996 లో మూడు ఎకరాల భూమి ఉందన్నారు. దానికి సంబంధించిన పాసుబుక్కులు ఉన్నాయని, ఆ భూమిలో నాటి నుండి నేటి వరకు బోర్ మోటర్, పైప్ లైన్ వేసుకుని ఆరుతడి పంటలు పండించానని సంతోష్ రెడ్డి పేర్కొన్నారు.గతం నుండి ఉన్న చిన్న చిన్న మడులను పెద్దదిగా చేపట్టడానికి గత కొన్ని రోజులుగా భూమిని చదును చేసుకుంటు పేద్ద మడులను చేసుకుంటున్నానని, కానీ ఇతరుల భూమిని మాత్రం కాబ్జా చేయలేదన్నారు. ఏదో ఒక రచ్చ చేసి తన పేరును నష్టం చేసే దురుద్దేశంతో వెనుక ఉండి ఇలాంటి తంతంగాన్ని చేయిస్తూన్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.180 సర్వే నెంబర్ లో ఫారెస్ట్ భూములను కోందరు కాబ్జా లుచేసి కోర్టులో కేసులు నడుస్తున్నాయని,నా భూమి లో ఇతరులకు సంబంధం లేదని,180 సర్వే నెంబర్ లోని మూడు ఎకరాలకు సంబంధించిన పాస్ బుక్ ల నమోదైన వివరాలను విలేకరులకు అందజేశారు. దాడి ఇతరత్రా నిరాధారమైన అరోపణలు చేయడం మానుకోవాలని,తను చట్ట ప్రకారంగానే నడుచుకుంటానని సంతోష్ రెడ్డి వివరించారు.