మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ 13 ఏళ్ళ తర్వాత ‘గుంటూరు కారం’తో కలిసి వస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ టీజర్ తర్వాత, ఈ సినిమా నుండి మొదటి గీతం విడుదల కోసం ఫ్యాన్‌స ఎదురు చూస్తున్నారు.అటు మహేష్ బాబుకి, ఇటు త్రివిక్రమ్‌కి అద్భుతమైన ఆడియోలను అందించిన తమన్ ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు, ‘దమ్ మసాలా’ వంటి స్పైసీ ట్రాక్‌తో దీపావళిని జరుపుకోవాలని మేకర్స్ నిర్ణయించారు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ‘దమ్ మసాలా’ పాటను విడుదల చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలుపుతోంది. తమన్ అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయి. ‘నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి”, ”నేనో నిశబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం” వంటి పంక్తులతో గీత రచయిత పాత్రలోని లోతును ఆవిష్కరించారు. శ్రీలీల ఈ చిత్రంలో మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్యకష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.