మోపాల్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున మాజీ జెడ్పీటీసీ దంపతులు కమలా నరేష్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలుగా జెడ్పీటీసీగా తన వంతు సేవ చేశానని ముఖ్యంగ నన్ను జెడ్పీటీసీ గా ఎన్నుకున్నందుకు మండల ప్రజలకు అలాగే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మా తండ్రి సమానులు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కి శిరస్సువంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని, నా పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణాలు అలాగే మట్టి రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేశామని, అలాగే మాకు సహకరించిన మండల అధికారులకు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ సి ఈ ఓ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్ బడుగు బలగువర్గాల అభ్యున్నతకు నిరంతరం పోరాడాడని నాతోపాటు నిజామాబాద్ రూరల్ పరిధిలో ఎంపీపీ జడ్పీటీ స్థానాలను జనరల్ రిజర్వుడున్నా కూడా ఎస్టీ బిడ్డల కేటాయించిన మహోన్నత వ్యక్తిని ఈ సందర్భంగా బాజిరెడ్డి గురించి ఆయన తెలియపరిచారు. అలాగే పదవిలో ఉన్నా లేకున్నా మండల ప్రజలకు ఏ అవసరం వచ్చిన తన వంతు సహాయపడతానని చిన్న వయసులోనే నాకు ఇంత పెద్ద పదవి రావడం అనేది మోపాల్ మండల ప్రజల యొక్క దీవెనని అని ఆయన తెలిపారు. ఎల్లప్పుడు మీ కమల నరేష్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పదవిలో ఉన్నప్పుడు తెలిసి తెలియని ఏవైనా పొరపాట్లు చేస్తే మండల ప్రజలు తమల్ని క్షమించాలని ఆయన కోరారు.