ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో రాబోతున్న సినిమా ‘హను-మాన్’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లెట్‌లో ఉంటుంది. కొత్తదనం ఏమిటంటే.. ఇది మన తెలుగు సినిమా స్టయిల్ అఫ్ మేకింగ్‌లో ఉంటుంది. బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాని రాజమౌళి చేస్తే ఎలా వుంటుందో అలా ఉంటుంది. ఈ సినిమాకి అన్నీ వైపుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే… ఇదంతా ఒక డ్రీమ్‌లా ఉంది. ప్రేక్షకులు చాలా గొప్ప ఆదరణ చూపుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుంది. నేను గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.