చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను కీర్తన’. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సీతాకోకై ఎగిరింది మనసే’ లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు. ఈ పాటను కులుమనాలిలోని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరో, హీరోయిన్లుగా చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ”బేబి’ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేసిన సీతా కోకై” లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండటం ఈ చిత్ర విజయపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది’ అంటూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు, కథానాయకుడు చిమటా రమేష్ బాబు కతజ్ఞతలు తెలిపారు. మల్టీ జోనర్ ఫిల్మ్‌గా తెరకెక్కి, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబందం చెబుతోంది.