చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నేను – కీర్తన’ చిత్ర ప్రీ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాత డి.ఎస్.రావు, శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ‘సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరో, హీరోయిన్లుగా చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో, డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ, ‘ఈ చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కతజ్ఞతలు. నా సోదరి జ్యోతిర్మయి, నా జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారి సపోర్ట్ లేకుంటే… ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. ఒక మూవీ బ్లాక్‌బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి’ అని చెప్పారు.