
– యువకులంతా కథానాయకులుగా నిలువాలే
– ప్రజాసామ్య పరిరక్షణలో బాగస్వాములు కావాలే
– బీఆర్‌ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
నవతెలంగాణ-మల్హర్ రావు : ఉన్నతంగా చదువుకున్న యువకుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత నాదేనని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు.మండలంలోని తాడిచర్ల హైస్కూల్‌లో చదువుకున్న తాడిచర్ల, కాటారం మండలంలోని దామెరకుంట,గంగారంకు చెందిన 2013 టెన్త్ బ్యాచ్ యువకులతో ఆయన బిరెల్లి రజినీ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కొయ్యుర్ నాగులమ్మ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా పుట్ట హాజరై మాట్లాడారు ఉన్నతంగా చదువుకుని కొంతమంది ఉద్యోగాలు చేస్తూ మరికొందరు ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తూ ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలువడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఆనాడు ఎమ్మెల్యేగా నాలుగేండ్లలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఈసారి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మన ప్రాంతంలో గోదావరి, మానేరు, సింగరేణి, అటవీలాంటి వనరులు ఉన్నాయని, వీటి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.స్థానికంగా ఉన్న ఏఎంఆర్ కంపెనీలో అనేక పరికరాలు సప్తై చేస్తుంటారని, ఆ పరికరాలను ఇక్కడే తయారు చేసి మనమే సప్తై చేసేలా వ్యాపారాల అభివృధ్దికి ఆలోచనలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా గోదావరిపరివాహక ప్రాంతాన్ని టూరీజంగా డెవలప్ చేస్తే అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువకులంతా కథానాయకులుగా నిలువాలని, సోషల్ మీడియాను వాడుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. అంతేకాకుండా ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడని ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈనాడు ఎన్నికలు రాంగానే గడియారాలు, చీరలు డబ్బులతో వస్తున్న విషయాన్ని యువకులు గమనించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడంలో కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు. ఈనాడు బీఆర్‌ఎస్ పార్టీకి, తనకు మద్దతుగా నిలిచి తన గెలుపుకు సంపూర్ణ సహాకారం అందించేందుకు రావడం అబినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకవైపు సేవలు,మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హమీ ఇచ్చారు.