నాని నటించిన ఫీల్ గుడ్ ఫ్యామి లీ ఎంటర్‌టైనర్ ‘హారు నాన్న’. వైర ఎంటర్‌టైన్ మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించ నుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిం చారు. ఈనెల 7న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలౌతుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సెన్సేషనల్ సూపర్ హిట్ ఆడియోని అందించిన కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మీడియాతో ముచ్చటించారు.
ప్రతి సినిమా పరీక్షే
ప్రతి సినిమా ఒక పరీక్షే. ఈ చిత్రం నన్ను నేను ఎక్స్ ఫ్లోర్ చేసుకోవడానికి బాగా తోడ్పడింది. హదయం, ఖుషి, హారు నాన్న.. ఇలాంటి చిత్రాలన్నిటిలో కామన్‌గా లవ్, రొమాన్స్, డ్రామా ఉంది. అయితే వీటిలోనే కొత్తదనం చూపించడానికి సంగీత దర్శకుడే కాదు.. దర్శకుడు, రచయిత, ఎడిటర్.. అలా అందరూ దష్టి పెడతారు. ప్రేమను అంగీకరిం చడం, మరొకరు తిరస్కరిం చడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ ఆ కథని ఎంత యూనిక్‌గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం.
సంగీతం కూడా అంతే..
కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్‌గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి ఉం టుంది. సంగీతం కూడా అంతే. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ ఉంటుంది. హాయిగా, రొమాంటిక్‌గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం ఉందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది. సంగీతం విషయంలో నా వరకూ దర్శకుడి విజన్‌ని ఫాలో అవుతాను. ఈ విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్‌కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. ఇది వెరీసాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం. ఇందులో లైటింగ్, విజువల్స్, మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతని ఇచ్చేలా ఉంటాయి.
కొత్త అనుభూతినిస్తుంది
దర్శన, ఖుషి, సమయమా, అమ్మాడి.. పాటల్లో ఒక పదంతో హుక్ చేసే స్వభావం కనిపిస్తుంది. వందకి వంద శాతం నమ్మకంతో చెబుతున్నా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. ప్యాషన్ ఉన్న నిర్మాతలు నిర్మిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమానే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం శర్వానంద్, శ్రీరాం ఆదిత్య, అలాగే రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలకు పని
చేస్తున్నాను.