– ఎవరు అదైర్య పడొద్దు, అండగా ఉంటా
– ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎవరు అధైర్య పడొద్దని మాజీ స్పీకర్ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులో ఓ ప్రైవేటు కల్యాణ వేదికలో నియోజకవర్గస్థాయి నాయకుల కార్యకర్తల ప్రజాప్రతినిధుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి బాన్సువాడ నియోజకవర్గ 9 మండలాల నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.ప్రజా తీర్పును గౌరవిస్తూ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళల అండగా ఉంటానని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు తనను ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ప్రజా తీర్పునకు కట్టుబడి కొత్త ప్రభుత్వానికి స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం హామీలను నెరవేర్చాలని అన్నారు. ఇక నుంచి పూర్తి సమయం బాన్సువాడ నియోజకవర్గానికే కేటాయిస్తాన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికాకూడదని,. తాను అండగా ఉంటానంటన్నారు. ఏ ఒక్క కార్యకర్త మీద దాడి జరిగిన, . క్షణాల్లో అక్కడ చేరుకుంటానని వారికి ఎలాంటి భయం లేకుండా చూస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గనికి తానే బాస్ నాని అన్నారు. ఏ కార్యకర్త. అధైర్య పడవద్దని ఆయన భరోసా కల్పించారు. బాన్సువాడలో కొంతమంది నాయకులు కేవలం వారు పార్టీ ఇన్ ఛార్జ్ లేనని, తాను ప్రజల చేత ప్రజాస్వామ్యం. బద్దంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే నాని అన్నారు. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికారం పోయినప్పటికీ తాను బాన్సువాడకు ఎమ్మెల్యేగా ఉన్నానని బాన్సువాడను అభివృద్ధి విషయంలో కానీ, ప్రజల, నాయకులు, కార్యకర్తల విషయంలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఉంటానని వెల్లడించారు. ఉడుత బెదిరింపులకు ఎవరు భయపడకూడదని, ప్రజలకు కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,. నియోజకవర్గ సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,. నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.