నేను రివ్యూ రాస్తా : నిర్మాత దిల్‌ రాజు

I will write a review : Producer Dil Rajuవంశీ రామ్‌ పెండ్యాల, అజరు, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌, పారుపల్లి ప్రొడక్షన్‌ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్‌ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్‌ విజన్‌గా జర్నలిస్ట్‌ ప్రభు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్‌ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్‌ పులి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 23న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. దిల్‌ రాజు మాట్లాడుతూ, ”రేవు’ కాన్సెప్ట్‌ బాగుంది. రాంబాబు, ప్రభు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమా తీశారు. కాబట్టి వీళ్ళ సినిమాని చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు. దర్శకుడు కోదండ రామిరెడ్డి, జర్నలిస్ట్‌ ప్రభు, నిర్మాతలు మురళీ, రామ సత్యనారాయణ, ప్రసన్న కుమార్‌, దామోదర ప్రసాద్‌, డీఎస్‌ రావు, దర్శకుడు రేలంగి నర్సింహారావు, నటుడు ప్రదీప్‌ తదితరులు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.