నేను మీ నాన్నను…!

నేను మీ నాన్నను...!నేను మీ నాన్నను
నా కలల్ని త్యాగం చేసుకుని
మీ కలలను సాకారం చేశాను
నేను ఆత్మను ఎవరైతే ప్రళయం సష్టించారో…!
మీరు సుఖాలను పొంది
నాకు ప్రతిగా ఏమి చ్చారు..?
బహుమతిగా ఇచ్చిందేమిటి…?
నాకు చూయించండి నా ఇల్లు ఎక్కడ…?
వినండి నా ప్రియ తనుజులారా…
నా కథను,గాధను
ఎప్పుడైనా అడిగారా…?
”నాన్న ”ఎటు వెళ్లింది మీ ”రంగుల బాల్యం” అని…?
గుర్తుంచుకోండి మీరు లేని ప్రపంచాన్ని నేను ఊహించలేదు…!
నా ”యవ్వనం” మొత్తాన్ని మీ ”క్షేమం” కోసమే ధారపోశాను.
మీరు యవ్వనంలో నేను వద్ధాప్యంలో..!
చూస్తుండగానే రోజులు గడిచి మత్యువుకు దగ్గరగా..!
నాకు చూయించండి నా ఇల్లు ఎక్కడ..?
నేను మీ నాన్నను
నా కలల్ని దూరం చేసుకుని
మీ కలల్ని సాకారం చేశాను….

డాక్టర్‌. మహమ్మద్‌ హసన్‌, 9908059234