ప్రయాణం నేడు చాలా మందికి ఓ ప్రేరణ. భారత వైమానిక దళంలో రెండవ బ్యాచ్‌లో చేరిన 25 మంది మహిళల్లో ఈమె కూడా ఒకరు. అక్కడ ఆరేండ్ల పని తర్వాత ఆమె ఐటీ పరిశ్రమలో చేరారు. ఇప్పుడు డెల్ టెక్నాలజీస్‌లో సీనియర్ నాయకురాలిగా, సామాజిక ప్రయోజనాల కోసం సాంకేతికతపై మక్కువ పెంచుకున్నారు. ఆ రంగంలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. వైమానిక దళ అధికారి నుండి టెక్ లీడర్ వరకు ఎదిగిన ఆమె విజయ ప్రస్థానం నేటి మానవిలో…
కర్నాటకలోని బెలగావి (అప్పటి బెల్గాం) పట్టణంలో పెరిగిన తేజ చిన్నతనం నుండి చురుకైన అమ్మాయి. ఆమె తండ్రి డాక్టర్. దాంతో ప్రతి పనికీ ఓ శాస్త్రీయ కారణం ఉందని నమ్ముతాడు. యుక్త వయసులో తేజ అనేక ప్రశ్నలు అడగేది. సమాధానాల కోసం అన్వేషించేది. ఇదే ఆమెను DIY ప్రాజెక్ట్‌లలో నిమగమయ్యేలా చేసింది. నేర్చుకోవడం పట్ల ఉన్న ఆసక్తి జీవితకాల అభిరుచికి పునాది వేసింది. డెల్ టెక్నాలజీస్‌లో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ (ఐటి)గా ఉన్న ఆమెకు ఇందులో 25 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె మొదటి సారి ప్రేమలో పడింది ఖగోళశాస్త్రంపై అని గుర్తుచేసుకుంది. అయితే అక్కడ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు. ‘1990ల ప్రారంభంలో మా బెలగావిలో ఖగోళ శాస్త్రాన్ని బోధించే కాలేజీ లేదు. ఆ చదువు కోసం బెంగళూరు కానీ, పూణే కానీ వెళ్ళాలి. నాకు అటు వెళ్ళే అవకాశం లేదు. ఖగోళ శాస్త్రం అంటే రాత్రిపూట ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని ఇంట్లో చదువుకు నో చెప్పేశారు. నా తదుపరి ఆలోచన ఇంజినీరింగ్, రేడియో ఖగోళ శాస్త్రానికి మారడం’ ఆమె చెప్పారు.
యూనిఫాంలో కెరీర్
తేజ కర్నాటక్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ కోర్సు మూడో ఏడాది చదువుతుండగా ఆమె జీవితం మలుపు తిరిగింది. భారతీయ వైమానిక దళం మొదటిసారిగా నాన్-మెడికల్ ప్రాంతాల్లోని మహిళల కోసం తలుపులు తెరిచింది. అందులో ఆమె సీనియర్లు ఇద్దరు చేరారు. యూనిఫారంలో ఉన్న స్త్రీలను చూడటం ఆమెకు ఉత్సాహంగా అనిపించింది. వారి ఉద్యోగం కూడా సవాలుగా అనిపించింది. ‘నేనూ నా చివరి ఏడాదిలో ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్నాను. రెండవ బ్యాచ్ మహిళా అధికారులలో చేరడానికి షార్ట్‌లిస్ట్ చేసిన టాప్ 25 మంది మహిళల్లో నేనూ ఉన్నాను. బెంగుళూరులోని జలహళ్లిలోని ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో మా ప్రాథమిక శిక్షణ. తర్వాత నాకు మౌంట్ అబూకిలో పోస్టింగ్ ఇచ్చారు’ అని ఆమె చెప్పారు.
ఎయిర్ హోస్టెస్‌లా అనేవారు
ఈ యూనిఫాం తేజాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో యూనిఫారంలో నడుచుకుంటూ వస్తున్న ఆమె వద్దకు ప్రజలు వచ్చేవారు. భారత వైమానిక దళంలో మహిళా అధికారుల ప్రవేశంపై మీడియా హర్షం వ్యక్తం చేయడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘కొంతమంది మమ్మల్ని ఎయిర్ హోస్టెస్‌లా అని అడిగారు. ఎందుకంటే అప్పట్లో మహిళలు ఈ రంగంలో ఉంటారనే సంగతే తెలీదు’ ఆమె నవ్వుతూ చెప్పారు. మౌంట్ అబూ వద్ద అధికారులు, ఎయిర్‌మెన్‌లతో సహా 300 మంది సిబ్బంది ఉన్న ఆ స్టేషన్‌లో ఇద్దరు మహిళల్లో తేజా ఒకరు. మహిళలకు ప్రత్యేక వాష్‌రూమ్ లేదు. పైగా ఇంతకు ముందు మహిళల నుండి సూచనలు తీసుకోని పురుషుల్లో తమ పట్ల నమ్మకాన్ని పెంచుకోవడం వారికి సవాలుగా ఉండేది. తర్వాత కాలంలో ఆమె నాసిక్, బెంగళూరులో కూడా పని చేశారు. ఒక పెద్ద స్టేషన్‌కు సంబంధించిన మొత్తం సిగల్స్ యూనిట్‌ను కమాండ్ చేసే అవకాశాన్ని పొందారు.
మూస పద్ధతులను బద్దలు కొట్టి
ఐటీ బూమ్ భారతదేశాన్ని తాకినప్పుడు పరిస్థితి మారిపోయింది. అప్పటికే పరిశ్రమలో ఉన్న తేజా సోదరుడు దాని వృద్ధి, ప్రయాణాలతో కూడిన ఉత్తేజకరమైన సంఘటనల గురించి ఆమెకు చెప్పాడు. తన ఆరేండ్ల షార్ట్ సర్వీస్ కమీషన్ పూర్తి చేసి, వైమానిక దళాన్ని విడిచిపెట్టి, ఐటీ పరిశ్రమకు తగిన శిక్షణతో టీసీఎస్‌లో డెవలపర్‌గా చేరారు. ‘నేను ఈ రంగానికి కొత్త కాబట్టి వేతనం కూడా తక్కువే. ఏడాది తర్వాత నాకు డెన్మార్క్ వెళ్లే అవకాశం వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత టెలికాం డొమైన్‌లోని విప్రో టెక్నాలజీస్‌లో చేరాను’ అని ఆమె చెప్పారు. 2005లో ఆమె డెల్ టెక్నాలజీస్‌లో మేనేజర్‌గా చేరారు. అప్పటి నుండి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. లింగ మూస పద్ధతులను బద్దలు కొట్టి భారతదేశంలో డెల్ ఐటిలో డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన మొదటి మహిళ తేజా అని చెప్పవచ్చు. డెల్ టెక్నాలజీస్‌లో ఆమె సామాజిక ప్రయోజనాల కోసం ఆమె టెక్ సీఎస్‌ఆర్‌ని ప్రారంభించి దానికి నాయకత్వం వహిస్తున్నారు.
విజయం అంటే ఏమిటి?
‘నేను నేర్చుకున్న విషయం ఇతరులు ఎదగడానికి ఎలా సహాయపడుతుందని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. తమ ప్రాధాన్యం, సమయ నిర్వహణపై మహిళల కోసం సెషన్‌లను నిర్వహిస్తాను. విజయం అంటే ఏమిటి? పైకి చేరుకోవడం అని నేను అంటారు. చీAూూజఉవీలో నేను హాజరైన సెషన్‌లలో ఒక గ్లోబల్ కంపెనీ సీఎఫ్‌ఓ విజయం గురించి మాట్లాడుతూ ‘ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అనవసరం. తోటివారి ఒత్తిడి మీ విజయాన్ని నిర్వచించకూడదు’ అన్నారు. ఇది నా మనసును బాగా తాకింది’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
ఇంకేదైనా చేయాలని
మేము సీఎస్‌ఆర్ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించి సాంకేతికతతో ఇంకేదైనా చేయాలని భావించాను. బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను రూపొందించడంలో సహాయం చేయడానికి దృష్టి లోపం ఉన్నవారి కోసం పనిచేసే మిత్ర జ్యోతి అనే ఎన్‌జీఓతో కలిశాము. మహమ్మారి సమయంలో వలస కార్మికుల పునరావాసం కోసం బుద్ధ ఫౌండేషన్ మమ్మల్ని సంప్రదించింది. దీని కోసం మేము మొబైల్ ఆధారిత పరిష్కారాన్ని రూపొందించాము. కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థన మేరకు పిల్లలు, పౌరుల్లో సైబర్ సెక్యూరిటీ అవగాహన కోసం గేమిఫికేషన్ సొల్యూషన్‌ను కూడా రూపొందించాము. ప్రస్తుతం నేను 300 మంది వాలంటీర్లతో కలిసి పనిచేస్తున్నాను. ఈ ప్రయాణం నన్ను ఎంతో
ఉత్తేజపరుస్తోంది.
సవాళ్లను పరిష్కరించడంలో
‘గత ఎనిమిది నెలలుగా నేను కృత్రిమ మేధ ఆధారితమైన ఏఐ ఆప్స్ విశ్వసనీయత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తనలో నిమగమై ఉన్నాను. మేము ఈ ఏఐ ఆప్స్ ప్లాట్‌ఫారమ్‌ను మార్చడానికి +వఅ A×ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మరింత సమర్థవంతంగా చేయడానికి చూస్తున్నాం’ అని ఆమె వివరించారు. మహిళలు నిచ్చెన ఎక్కేటప్పుడు వారికి రోల్ మోడల్‌లు, మార్గదర్శకులు ముఖ్యమని తేజా అభిప్రాయం. డెల్ టెక్నాలజీస్‌లో గొప్ప ప్రోగ్రామ్‌లను మహిళలు అందిస్తున్నప్పటికీ వారి సవాళ్లను పరిష్కరించడంలో ఆసల్యం జరుగుతుందని అన్నారు. ‘ఇంజనీరింగ్‌లో మా క్లాసులో నలుగురు అమ్మాయిలమే ఉండేవాళ్ళం. నేడు ఈ సంఖ్య దాదాపు సమానంగా ఉంది. సమాజం కూడా అభివృద్ధి చెందింది. నా కుటుంబంలో నేను మొదటి మహిళా ఇంజనీర్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇది స్వాగతించ దగిన మార్పు’ ఆమె చెప్పింది.
– సలీమ