నేను లోకల్‌ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి

– పైళ్ల వల్లనే త్రిబుల్‌ ఆర్‌ అలైన్మెంట్‌ మార్చారు
– కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి
– జనసంద్రంలా మారిన పట్టణ దారులు
నవతెలంగాణ-భువనగిరి
‘నేను భువనగిరి నియోజకవర్గంకు చెందిన వ్యక్తినని ఒక్క ఛాన్స్‌ ప్రజలు ఇవ్వాలి’ అని భవనగిరి నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం భువనగిరి పట్టణం రైల్వే స్టేషన్‌ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు వేలాది మందితో కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మొత్తం జిల్లా కేంద్రం జనసంద్రంలా మారింది. జై కాంగ్రెస్‌ నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్‌ వేసిన అనంతరం ర్యాలీలో కుంభంకు అడుగడుగునా జన నీరాజనం పలికారు. పూల వర్షం, డప్పు వాయిద్యాలు, కళాకారుల ఆట పాటలు, జానపద కళాకారులు నత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌రెడ్డి వల్లనే త్రిబుల్‌ ఆర్‌ అలైన్మెంట్‌ మార్చారన్నారు. అందుకు వ్యతిరేకించిన రైతులను జైలుకు పంపడమే కాకుండా బేడీలు వేసి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూములు పోవద్దని రైతుల భూములు పోయేటట్లు చేశారన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 10 ఏండ్లుగా, వలిగొండ మండలంలో 20ఏండ్లుగా ప్రజాసేవ కార్యక్రమంలో ఉన్నామన్నారు. గత ఎన్నికల్లో ఓడిన నేను నియోజకవర్గం జిల్లాలో అందరికీ అందుబాటులో ఉన్నానని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ పౌష్టికాహారం అందించి ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. వలిగొండ జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు సుంకిశాల మల్లారెడ్డి ముందుకు రాగా వైయస్సార్‌ ని కలిసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు ఇచ్చే విధంగా కషి చేశానన్నారు. రెండుసార్లు గెలిచిన పక్క నియోజకవర్గానికి చెందిన పైళ్ల శేఖర్‌ రెడ్డి ఈనియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయించలేకపోయారన్నారు. ఆ ప్రాజెక్టులు భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరహర అందించలేదన్నారు. మేధావులు, కార్మికులు కర్షకులు ఈ విషయాన్ని ఆలోచించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
అమ్మ ఆశీర్వాదం గెలిపించేనా…
అనిల్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి ముందు తన తల్లి కుంభం ప్రేమలత వద్ద ఆశీర్వాదం తీసుకొని,జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ దర్శనంతో మొదలుకొని , పడమటి సోమవారం బసవలింగేశ్వర స్వామి ఆలయంలో , భువనగిరి ఎల్లమ్మ దేవాలయంలో, కిసాన్‌ నగర్‌ దర్గాలో, గాస్పల్‌ చర్చి వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, అభిమానులతో కలిసి భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ చైర్మెన్‌్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రమోద్‌ కుమార్‌, బర్రె జహంగీర్‌ తో కలిసి తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి, పీసిసీ కమిటీ సభ్యులు తంగేళ్లపల్లి రవికుమార్‌, మండల అధ్యక్షులు ఎలిమినేటి కష్ణారెడ్డి, ఎల్లంల జంగయ్య యాదవ్‌, వాకిటి పద్మా అనంతరెడ్డి,బి సత్యనారాయణ, పాక మల్లేష్‌ యాదవ్‌, యుగెందర్‌ రెడ్డి, వడిచెర్ల కష్ణ యాదవ్‌, కైరంకొండ వెంకటేష్‌, గాజుల క్రాంతికుమార్‌, మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, రజిని, కుటుంబ సభ్యులు కీర్తి రెడ్డి, స్పూర్తి రెడ్డి ,శ్రీ రామ్‌ రెడ్డి, వేల సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.