– పైళ్ల వల్లనే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారు..
– కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి
నవతెలంగాణ – భువనగిరి
నేను భువనగిరి నియోజకవర్గం చెందిన వ్యక్తినని ఒక్క ఛాన్స్ ప్రజలు ఇవ్వాలని భవనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం భువనగిరి పట్టణం రైల్వే స్టేషన్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు వేలాది మందితో డప్పు, డోలు వాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో, పాటలు, నినాదాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని కోరిన రైతుల జైలుకు పంపడమే కాకుండా బేడీలు వేసి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వల్లనే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని ఆరోపించారు. తన భూములు పోవద్దని రైతుల భూములు పోయేటట్లు చేశారన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా, వలిగొండ మండలంలో 20 ఏళ్లుగా ప్రజాసేవ కార్యక్రమంలో ఉన్నామన్నారు. గత ఎన్నికల్లో ఓడిన నేను నియోజకవర్గం జిల్లాలో అందరికీ అందుబాటులో ఉన్నానని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ పౌష్టికాహారం అందించు ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. వలిగొండ జూనియర్ కళాశాల ఏర్పాటుకు సుంకిశాల మల్లారెడ్డి ముందుకు రాగా వైయస్సార్ ని కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు ఇచ్చే విధంగా కృషి చేశానన్నారు. రెండుసార్లు గెలిచిన పక్క నియోజకవర్గానికి చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయించలేకపోయారన్నారు. ఆ ప్రాజెక్టులు భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరహర అందించలేదన్నారు. పోచంపల్లి మండలంలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైనారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలుష్యాన్ని తగ్గిస్తామన్నారు. తండ్రి కొడుకు కూతురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలతో పాటు వెలమ సామాజిక వర్గం కూడా బాధపడే స్థాయికి వారి పరిపాలన జరుగుతుందన్నారు. దళిత బంధువు లాంటి పథకాలాన్ని బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతున్నాయి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 75 సీట్లు వస్తున్నాయని అధికారంలో పాలుపంచుకోవడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొన సాగుతుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష 30 వేల కోట్లు వృధా కానునాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కట్టిన ప్రాజెక్టు పొంగిపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లో అన్ని అవకతకులు జరిగాయని ఆరోపించారు .గతంలో సాంకేతిక నైపుణ్యత నిధులు లేని కాలంలో నాగార్జునసాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మించుకున్నామని అవి నేటికీ పటిష్టంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులన్ని కమిషన్ల కోసం నాణ్యత లేని పనులు చేసి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారన్నారు. చిన్న నీటి కాలువలు పునాది గాని ధర్మారెడ్డి కాల్వ ఓ నేటికీ పూర్తి కాలేదు అన్నారు. నియోజకవర్గంలో ఒక డిగ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేని అసమర్ధుడు ఎమ్మెల్యే ఉండడమా, లేక ప్రజల కోసం అందుబాటులో ఉండే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కావాలనో ప్రజలు గ్రహించాలన్నారు. మేధావులు కార్మికులు కర్షకులు ఈ విషయాన్ని ఆలోచించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రదర్శనలో పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి , ప్రణాళిక బోర్డు మాజీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, వలిగొండ ఎంపీపీ వెంకటేశం ,కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.