నేనూ, మా అమ్మా పార్టీ మారే ప్రసక్తే లేదు

– రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య అక్రమ పొత్తు: పటోళ్ల కార్తీక్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నేనూ, మా అమ్మ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదు’ అని బీఆర్‌ఎస్‌ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయనీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య అక్రమ పొత్తు కొనసాగుతున్నదని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ కలిసి తెలంగాణ సంపదను అమ్మేస్తున్నాయనీ, సింగరేణి గనులను వేలం వేస్తున్నా యని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ వేసిన విద్యుత్‌ కమిషన్‌ను బీజేపీ సపోర్టు చేస్తూ కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం తెలుగుదేశం కార్యాలయంలో సంబురాలు చేసుకోవడమేంటని నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ కలిసి పనిచ ేయాలని రాహుల్‌గాంధీ సూచించినట్టుందని ఎద్దేవా చేశారు. తెలంగా ణకు కవచం లాంటి పార్టీ బీఆర్‌ఎస్‌ అనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడు తున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటున్న రాహుల్‌గాంధీకి అందులోని పదో షెడ్యూల్‌ ప్రకారం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిం చొద్దని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమన్నారు.