తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్‌లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ గీతికా తివారీ మీడియాతో ముచ్చటించారు. ‘మాది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను.
టాలీవుడ్‌లో ఆడిషన్స్ ఇచ్చే క్రమంలో దర్శకుడు తేజని కలిస్తే, ఆయన ఈ సినిమా ఆడిషన్స్‌కి పిలిచారు. కొత్త వారిని పరిచయం చేయడంలో ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం అదష్టం. ఇందులో నా పాత్ర పేరు అహల్య. అమాయకత్వం నుంచి స్ట్రాంగ్‌అండ్ పవర్‌ఫుల్‌గా ఎదిగే పాత్ర. తనకి ప్రేమపై నమ్మకం ఉంటుంది. నాది చాలా కీలకమైన పాత్ర. చాలా కష్టాలు ఎదుర్కొంటూ వెళ్ళే ఈ పాత్ర ప్రయాణం నాకు చాలా నచ్చింది. అలాగే సవాలుగా అనిపించింది. తేజ హీరోయిన్‌లను అద్భుతంగా చూపించే మార్క్‌లోనే ఉంటుంది. అభిరామ్‌తో వర్క్ చేయడం ఎలా హ్యాపీగా అనిపించింది. ఆర్పీ పట్నాయక్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సదా అడ్వకేట్ పాత్రలో, చాలా స్ట్రాంగ్ రోల్ చేశారు.